W.G: పాలకొల్లులోని శ్రీదాసరి నారాయణరావు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఇవాళ ముగిశాయని ప్రిన్సిపల్ డా. పి. శోభారాణి తెలిపారు. మంచి పుస్తకం మంచి స్నేహితుని వంటిదని పాఠ్యపుస్తకాలతో పాటు సాహితీ సంబంధమైన విజ్ఞాన దాయకమైన పుస్తకాలు చదవాలన్నారు. విద్యార్థి దశ నుంచే కథలు, బాల గేయాలు రాయడం అలవాటు చేసుకోవాలని విద్యార్థులకు తెలిపారు.