AP: సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబాన్ని ఇప్పటికీ కొందరు బెదిరిస్తున్నారని అన్నారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా ప్రజల కోసమే పని చేస్తామని చెప్పారు. తమ కుటుంబానికి రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమని తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో ప్రజలంతా తమ కుటుంబ సభ్యుల్లా స్పందించారని వెల్లడించారు.