MNCL: హాజీపూర్ మండలంలోని గుడిపేట, నంనూర్ గ్రామాలలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఇవాళ సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతుల వద్ద నుండి నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలు చేసి మద్దతు ధర చెల్లిస్తుందని తెలిపారు. ఈ మేరకు రైతుల వద్ద నుండి నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా కేంద్రాల నిర్వహకులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.