NLG: నేరేడుగొమ్ము మండలం పేర్వాలలో ఐసీడీఎస్ పెద్దమునిగల్ సెక్టార్ ఆధ్వర్యంలో గురువారం ‘బేటీ బచావో బేటీ పడావో’ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు సూపర్వైజర్ శోభ మాట్లాడుతూ.. శిశు విక్రయాలు చట్ట విరుద్దమని తీవ్రమైన నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే 1098 లేదా 100 కు సమాచారం ఇవ్వాలని సూచించారు.