TG: ములుగు జిల్లాలో గుప్త నిధుల వేట కలకలం సృష్టించింది. మంగపేటకు చెందిన కొంత మంది ఇటీవల మహారాష్ట్రలోని ఓ మారుమూల గ్రామంలోని ఇంట్లో తవ్వకాలు జరిపారు. అయితే వారికి దొరికిన బంగారం పంచుకునే విషయంలో తేడాలు రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.