ఇమ్మడి రవి అరెస్ట్ తర్వాత iBOMMA క్లోజ్ అయిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ‘ఐబొమ్మ వన్’ పేరుతో మరో పైరసీ వెబ్సైట్ తెరపైకి వచ్చింది. ఈ వెబ్సైట్లో సినిమా చూసేందుకు క్లిక్ చేస్తుంటే ‘Movierulz’కి కనెక్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది. కాగా, టికెట్ల ధరలు తగ్గించనంత వరకు ఇలాంటి సైట్లు వస్తూనే ఉంటాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.