E.G: అనపర్తి ద్వారంపూడి బుల్లమ్మాయి జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. వివిధ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రధానోపాధ్యాయురాలు కళ్యాణి బహుమతులను అందజేశారు. విద్యార్థులకు గ్రంథాలయాల ఆవశ్యకతను ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి అభిలాష్ పాల్గొన్నారు.