ADB: కరెంట్ షాక్తో ఆవు మృతి చెందిన ఘటన భైంసా మండలంలో చోటుచేసుకుంది. చింతలబోరి గ్రామానికి చెందిన గుమ్ముల శ్రీనివాస్ ఆవు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురైంది. తన వ్యవసాయ చేనులో ఉన్న ట్రాన్స్ ఫార్మర్కు ఆవు తగలడంతో కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు బాధితుడు తెలిపారు. ఆవు విలువ సుమారు రూ.40 వేలు ఉంటుందని, ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరాడు.