MBNR: జిల్లా వ్యాప్తంగా రైతులు రోడ్లపై ధాన్యం ఆరబెట్టకూడదని జిల్లా ఎస్పీ జానకి అన్నారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. రోడ్లపై ధాన్యాన్ని ఆరబెట్టడం మూలంగా వాహనదారులకు ఇబ్బందులతో పాటు ప్రమాదాలు ఎదురవుతున్నాయన్నారు. ఏవైనా అనుకోని ప్రమాదాలు జరిగితే మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని రైతులను హెచ్చరించారు.