VZM: 58వ, జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకలు కొత్తవలస శాఖ గ్రంథాలయంలో ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ ఎం.వై. రామస్వామి, వార్డు మెంబర్ ముఖ్యఅతిథిగా హాజరై పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రధానం చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గ్రంథాలయంలో పుస్తక పఠనం అలవర్చుకుంటే ఉన్నత శిఖరానికి చేరుకోవచ్చన్నారు.