MDK: జిల్లాలో ఎంపికైన వికలాంగుల లబ్ధిదారులకు సహాయ పరికరాలు పంపిణీ చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక సభ్యులు విజ్ఞప్తి చేశారు. మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్‌కు ఇవాళ వినతిపత్రం సమర్పించారు. సహాయ పరికరాలు పంపిణీ కోసం గతంలో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. 7920 మంది లబ్ధిదారులు 16 రకాల పరికరాల కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.