TTD ఛైర్మన్ BR నాయుడు భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుర్తు తెలియని సంస్థలకు విరాళాలు ఇచ్చి వారి ఉచ్చులో పడవద్దని సూచించారు. ‘గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్’, savetemples.org వాళ్ళు భక్తులను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. అలాగే చట్టవిరుద్ధమైన విరాళాలను కోరుతూ మోసగిస్తున్నట్లు తెలిసిందన్నారు. ఇటువంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలన్నారు.