AP: కల్తీ నెయ్యి వ్యవహారంలో టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని సిట్ అధికారులు మూడున్నర గంటలపాటు విచారించారు. భోజన విరామం తర్వాత విచారణ కొనసాగే అవకాశం ఉంది. HYDలోని ఆయన నివాసంలో ప్రశ్నించారు. ఈ కేసులో ఇప్పటికే వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ చిన్న అప్పన్నను సిట్ విచారించింది. అతడు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సుబ్బారెడ్డిని అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం.