KDP: సూపర్ సిక్స్ హామీలు సూపర్ హిట్ అయ్యాయని సీఎం చంద్రబాబు మాటల్లో వాస్తవం లేదని, పచ్చి అబద్ధాలని కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి అన్నారు. ఇవాళ వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి నిరుద్యోగికి నెలకు రూ. 3,000 నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి కింద 19-59 ఏళ్ల మధ్య ఉన్న ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.1,500 ల ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు.