TG: ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య శతవసంత జన్మదినం సందర్భంగా CM రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. చుక్కా రామయ్య చేసిన సేవలను సీఎం కొనియాడారు. వేల మంది విద్యార్థులను ఐఐటీలకు పంపి, ఉన్నత విద్యను అందించడంలో ఆయన చేసిన కృషిని, నిత్య విద్యార్థిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా, సామాజిక సంస్కర్తగా ఆయన అందించిన స్ఫూర్తిని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.