గుజరాతి మూవీ ‘లాలో:కృష్ణ సదా సహాయతే’ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. కేవలం రూ.50 లక్షలతో తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.60 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ‘లాలో’ అనే రిక్షా డ్రైవర్ చుట్టూ తిరిగే కథతో దర్శకుడు అంకిత్ సఖియా తెరకెక్కించాడు. ఇక ఈ మూవీలో కరణ్ జోషి ప్రధాన పాత్రలో నటించాడు.