GNTR: తెనాలి మండలం కొలకలూరులో శుక్రవారం పోస్టల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు పోస్టల్ డెవలప్మెంట్ ఆఫీసర్ సత్యనారాయణ ఇవాళ ఓ ప్రకటనలో తెెలిపారు. గ్రామంలోని సెంటర్లో ఉదయం 10:00 నుంచి జరిగే క్యాంపులో పోస్టల్ ఇన్సూరెన్స్, పొదుపు పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. కొలకలూరుతో పాటు చుట్టుపక్కల గ్రామాల పరిధిలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.