‘అవును’ మూవీ పోస్టర్ చూసి ఓ వ్యక్తి తనకు కాల్ చేసి తిట్టాడని దర్శకుడు రవిబాబు తెలిపాడు. ‘ఈ మూవీలో ఏనుగంత ప్రాబ్లంలో హీరోయిన్ ఉందని చెప్పడం కోసం పోస్టర్ చేయించా. దాన్ని చూసి పిల్లలను తీసుకుని మూవీకి వెళ్లానని, అందులో ఏనుగు లేదని ఓ వ్యక్తి కాల్ చేసి తిట్టాడు. ప్రేక్షకులు మనం తీసే మూవీలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి’ అని అన్నాడు.