దక్షిణాఫ్రికాతో శనివారం నుంచి రెండో టెస్టు జరగనుంది. ఈ టెస్టుకు అందుబాటులో ఉండేందుకు గిల్ చివరి ప్రయత్నంగా శుక్రవారం ఫిట్నెస్ పరీక్ష చేయించుకోనున్నట్లు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ వెల్లడించాడు. ఆ పరీక్షలో అతడు పాస్ అయితే రెండో టెస్టుకు అందుబాటులో ఉంటాడు. కాగా, మెడ నొప్పి కారణంగా తొలి టెస్టు ఆట మధ్యలోనే గిల్ మైదానాన్ని వీడిన విషయం తెలిసిందే.