AP: రాష్ట్రంలో ఆపరేషన్ సంభవ్ విజయంవంతం అయ్యిందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. రంపచోడవరంలో పర్యటించిన ఆయన మావోయిస్టుల అరెస్టులు, ఎన్కౌంటర్పై మాట్లాడారు. 2026 మార్చి కల్లా ఏపీలోనూ మావోయిజాన్ని అంతం చేస్తామని వెల్లడించారు. హిడ్మా, టెక్ శంకర్ లాంటి టాప్ కమాండర్లను మట్టుబెట్టినట్లు చెప్పారు. 50 మంది మావోయిస్టుల అరెస్టులు జరిగినట్లు పేర్కొన్నారు.