GDWL: బాల్య దశ ప్రతి ఒక్కరికి మరపురానిదని ఆ దశ అందరి జీవితంలో ఎప్పటికీ గుర్తుంటుందని అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు పేర్కొన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఐడీవోసీలో బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగింపు వేడుకలను ఆయన ప్రారంభించారు. చదువుకోవడం బాలల హక్కు అని బడి మానేసిన వారిని బడిలో చేర్చాలని సూచించారు.