KDP: కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి 28వ డివిజన్ మాచుపల్లి బస్టాండ్ పరిధిని గురువారం మరోసారి సందర్శించారు. అనంతరం “మన కడప -స్వచ్చ కడప” కార్యక్రమంపై పునఃసమీక్ష చేశారు. నిన్న గుర్తించిన చెత్త నిల్వలు, డ్రైనేజ్ సమస్యలు, వీధుల శుభ్రతపై తీసుకున్న చర్యలను పరిశీలించారు. ఇలాంటివి మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.