ప్రకాశం: జిల్లా వాసుల విమానాశ్రయ కల త్వరలోనే నెరవేరనుంది. ఎంపీ, ఎమ్మెల్యే చొరవతో కొత్తపట్నం మండలం ఆలూరు వద్ద విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి డీపీఆర్ తయారు చేసేందుకు తాజాగా సర్వే ప్రారంభమైంది. ఈ సర్వే పూర్తయితే ఎయిర్ పోర్ట్ కల నెరవేరేందుకు సమయం దగ్గరలోనే ఉందని చెప్పవచ్చు.