నల్గొండలోని పెద్దబండ-గొల్లగూడ రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి మంజూరు చేయాలని ఈరోజు నల్గొండకు విచ్చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అల్లి సుభాష్ యాదవ్ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. రైల్వే బ్రిడ్జి లేక పోవడంతో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించి బ్రిడ్జి మంజూరు చేయాలని ఆయన మంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు, తదితరులు పాల్గొన్నారు.