KRNL: మంత్రాలయంలో వెలసిన శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో ఇవాళ అమావాస్య పర్వదినం సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ పూజారులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదం అందజేసి శాలువా పూలమాలతో సన్మానించి ఆశీర్వదించారు. అనంతరం తిక్కారెడ్డి అందరూ బాగుండాలని ఆకాంక్షించారు.