SRD: ఖేడ్ పట్టణంలోని బసవేశ్వర చౌక్ నుంచి మంగళ పేట్ వెళ్లే బైపాస్ రోడ్డు గుంతలమయం అయింది. నిత్యం వందలాది వాహనాలు బైపాస్ మీదుగా కరస్ గుత్తి, మనూర్, జహీరాబాద్, రాయిపల్లి, పంచగామా ప్రాంతాలకు వెళ్తుంటారు. అయితే గత ఐదేళ్ల కిందట వేసిన బైపాస్ సీసీ రోడ్డు ప్రస్తుతం పూర్తిగా శిథిలమైంది. వాహనాలు వెళ్తుంటే దుమ్ము లేస్తోంది. కొత్త రోడ్డు వేయాలని ప్రజలు కోరుతున్నారు.