W.G: గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా పాలకొల్లు శాఖా గ్రంథాలయంలో విద్యార్ధులకు ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహించారు. జూనియర్స్ విభాగంలో పోడూరు మండలం చింతలగరువు విద్యార్థులు సత్తా చాటారు. జి. నిహారిక ప్రథమ స్థానం, బి. సుశాంక్ ద్వితీయ, ఎం.అక్షిత తృతీయ స్థానాలు దక్కించుకోగా, బి. నందన కన్సోలేషన్ బహుమతి గెలుచుకున్నారు.