ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా మృతదేహం ఛత్తీస్‌గఢ్‌లోని ఆయన స్వగ్రామం సుక్మా జిల్లా పూవర్తికి చేరుకుంది. కొడుకు మృతదేహాన్ని చూసిన హిడ్మా తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. దీంతో అక్కడ విషాద వాతావరణం నెలకొంది. హిడ్మా, ఆయన భార్య రాజక్క మృతదేహాల వద్దకు కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు భారీగా చేరుకున్నారు.