దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. నగరంలోని ఓ స్కూల్కు ఈ మేరకు బెదిరింపులు వచ్చాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యం పోలీసులకు సమాచారమివ్వగా.. విద్యార్థులు, సిబ్బందిని తరలించి తనిఖీలు చేశారు. తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో ఆ బెదిరింపులు ఫేక్ అని పోలీసులు తేల్చారు.