ADB: ఉట్నూర్ మండలంలోని పులిమడుగు, ఆందోలి గ్రామంలోని అంగన్వాడి కేంద్రాలలో సిబ్బందిని నియమించాలని ఉట్నూర్ ఐటీడీఏ ఇన్ఛార్జ్ పీవో యువరాజ్ మార్మాట్ను బీఆర్ఎస్వీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు ధరణి రాజేష్ కోరారు. ఈ మేరకు నాయకులతో కలిసి వినతి పత్రం సమర్పించారు. కొద్ది సంవత్సరాల నుంచి సిబ్బంది లేక గ్రామాల్లో పిల్లలు ఇబ్బందికి గురవుతున్నారని అన్నారు.