KRNL: ఓర్వకల్లులో ఇవాళ నిర్వహించిన “పొలం-పిలుస్తుంది” కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరి పంట సాగు విధానాలను పరిశీలించారు. అనంతరం రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మండల వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువుల సబ్సిడీలను అందించడంలో నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు.