TG: ఫార్ములా ఈ-రేస్ కేసులో KTRను ACB విచారించేందుకు గవర్నర్ అనుమతించడంపై BRS నేత హరీష్ స్పందించారు. ప్రశ్నించే గొంతులను రేవంత్ నొక్కే ప్రయత్నం చేస్తున్నారని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ని పెంచిన KTRను అక్రమ కేసులతో ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి కేసులు KTR, BRS నాయకుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేవని తేల్చి చెప్పారు.