ELR: పత్తి కొనుగులుపై వ్యాపారస్తులతో ప్రజాపంథా నాయకులు కుక్కునూరులో చర్చలు జరిపారు. ప్రస్తుతం ఇస్తున్న రూ. 8,110 గిట్టుబాటు కాదని స్వామినాథన్ కమిషన్ సిఫార్సు మేరకు రూ.14,000 ఇవ్వాలని కోరారు. స్లాట్ బుకింగ్తో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ క్రాప్ సంబంధం లేకుండా మొత్తం పంటను కొనుగోలు చేయాలన్నారు. సత్యనారాయణ, కన్నయ్య, మున్ని, సుభద్ర పాల్గొన్నారు.