BDK: టేకులపల్లి మండలంలో గురువారం ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటించారు. బర్లగూడెం, మొట్లగూడెం గ్రామంలో నిర్మాణలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే సందర్శించి నిర్మాణ పనులను వేగవంతం చేయాలనీ సూచించారు. అలాగే ఇటీవల మరణించిన పలు కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించి సానుభూతి తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇళ్ళు లేని నిరుపేదలకు అండగా నిలుస్తుందన్నారు.