NZB: పోతంగల్లో రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు కావడంపై కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం, MLA పోచారం, ఆగ్రో ఇండస్ట్రీ ఛైర్మన్ కాసుల బాలరాజ్ల చిత్రపటాలకు నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పుప్పాల శంకర్ మాట్లాడుతూ.. పోతంగల్ మండలం చెక్ పోస్ట్ నుంచి హున్సా వరకు రోడ్ల నిర్మాణాలనికి రూ. 30 కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు.