HYD: జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ అధ్యక్షతన కాసేపట్లో స్టాండింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో నగర పరిపాలనకు సంబంధించి కీలకమైన సుమారు 20 ముఖ్య అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు. రోడ్లు, పారిశుద్ధ్య చర్యలు, డ్రైనేజీ వ్యవస్థ, మౌలిక వసతుల అభివృద్ధి, పౌర సేవల మెరుగుదల వంటి నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.