GNTR: తెనాలి మండలం సంగం జాగర్లమూడి గ్రామంలో రేపు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో దీప్తి గురువారం తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని గ్రామంలో పనులను పరిశీలిస్తారని తెలియజేశారు. అనంతరం ప్రజల నుంచి మంత్రి అర్జీలు స్వీకరిస్తారన్నారు.