KMM: ఈనెల 21న జరగనున్న పీడీఎస్యూ (ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం) 23వ జిల్లా మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ ఆ సంఘం నాయకులు విస్తృత ప్రచారం చేపట్టారు. ఇందులో భాగంగా ఇవాళ జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులకు కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు భాను, శ్రీకాంత్, రవి, తదితరులు పాల్గొని, మహాసభ యొక్క ఆశయాలను వివరించారు.