HYD: మూసీ, ఈసా నదుల సంగమం వద్ద బాపు ఘాట్ ప్రాంతంలో 22 అడుగుల ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహం ఉంది. దీన్ని 1999లో ఏర్పాటు చేశారు. శాంతి, ఐక్యత, విద్యకు చిహ్నంగా ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ప్రస్తుత ప్రభుత్వం తెలిపింది. గాంధీ ఆశ్రమం ఏర్పాటు, విద్యా కార్యక్రమాలపై దృష్టి పెట్టనున్నారు.