నెట్టింట సర్కులేట్ అవుతున్న తన AI మార్ఫింగ్, డీప్‌ఫేక్ ఫొటోలపై నటి కీర్తి సురేష్ ఆందోళన వ్యక్తం చేసింది. ‘ఈ ఫేక్ ఫొటోలు నన్ను మానసికంగా బాధిస్తున్నాయి. వీటిని చూస్తే నిజంగానే నేను అలా ఫోజు ఇచ్చానా? అనే అనుమానం వస్తుంది. ఇది సెలబ్రెటీలకే కాదు.. సాధారణ ప్రజలకు కూడా ప్రమాదం. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలి’ అంటూ పోస్ట్ పెట్టింది.