WGL: సైబర్ నేరాలపై నెక్కొండ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై మహేందర్ సూచించారు. ప్రస్తుతం సైబర్ నేరాలు పెరిగాయని, ఆన్లైన్ మోసాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలన్నారు. బ్యాంకు అధికారులుగా మాట్లాడేవారిని, రుణాలు ఇస్తామని చెప్పే వారిని నమ్మవద్దన్నారు. సైబర్ నేరాలకు గురైతే 1930కి కంప్లేంట్ చేయాలని లేదా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఎస్సై సూచించారు.