ప్రకాశం: కనిగిరి మండలం తుమ్మగుంట గ్రామానికి చెందిన గొర్రెల సొసైటీ అధ్యక్షులు బాల గురవయ్య గురువారం ఆకస్మికంగా మృతి చెందారు. విషయం తెలుసుకున్న కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి బాల గురవయ్య భౌతికకాయాన్ని సందర్శించి, పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గొర్రెల సొసైటీ అభివృద్ధికి బాల గురవయ్య చేసిన సేవలు మరువలేనివని ఎమ్మెల్యే అన్నారు.