VSP: అక్కయ్యపాలెం షాదీ ఖానా కళ్యాణ మండపంలో గురువారం పీఎం ఆవాస్ యోజన- అర్బన్ 2.0 కింద లబ్దిదారులకు కొత్త గృహ నిర్మాణ చెల్లింపు కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా రూ.2,50,000 మంజూరు పత్రాలను విశాఖ ఎంపీ శ్రీభరత్, ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, 25వ వార్డు కార్పొరేటర్ సారిపిల్లి గోవింద్ అందజేశారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, అధికారులు, కూటమి నాయకులు, మహిళలు పాల్గొన్నారు.