NZB: బోధన్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద గురువారం ఉదయం రాయలసీమ ఎక్స్ప్రెస్ నిజామాబాద్ నుంచి బోధన్ వస్తున్న సమయంలో రైల్వే సిబ్బంది గేటు వేశారు. ఓ వాహనదారుడు ఆపకుండా గేటు కింద నుంచి వెళ్లడంతో గేటు డ్యామేజ్ అయ్యింది. గేట్ మ్యాన్ రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైల్వే సీఐ సుబ్బారెడ్డి రైల్వే గేటును పరిశీలించారు. తనంతరం అతడిపై కేసు నెమోదు చేశారు.