SKLM: ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామివారి రథసప్తమి వేడుకల ఏర్పాట్లను ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే గొండు శంకర్ ఇవాళ పరిశీలించారు. ఎలాంటి అంతరాయం లేకుండా నిర్వహించేందుకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూసుకొవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆలయ పరిసర ప్రాంతాలను సందర్శించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు.