ELR: జంగారెడ్డిగూడెంలో 20వ వార్డులో టీచర్స్ కాలనీలో రెండు రోడ్లను తవ్వేశారు. కొత్తగా నిర్మాణం చేపట్టకుండా ఇసుక మెటల్ సిద్ధం చేసి గత ఐదు నెలలుగా రోడ్డు వేయకుండా కాంట్రాక్టర్ కాలయాపన చేస్తున్నారని, మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇళ్లకు వెళ్లాలంటే ఇసుక గుట్టలు అడ్డంగా ఉండడంతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.