NLR: కలిగిరి మండలం వెలగపాడు పంచాయతీలో, సంగం-కలిగిరి రహదారి నుంచి కొత్తూరు గ్రామానికి రూ. 1 కోటి 75 లక్షల వ్యయంతో నాబార్డ్ RIDF నిధుల సహకారంతో నిర్మించారు. ఈ నూతన రహదారిని ఇవాళ ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రారంభించారు. ఆయన శిలాఫలకాన్ని ఆవిష్కరించి, కూటమి పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు.