ADB: ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలనీ టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంఛార్జ్ ఆత్రం సుగుణ అన్నారు. గురువారం ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జిల్లాలోని ఆదివాసీ గిరిజన ప్రాంతాల ప్రజలకు ఉన్న సమస్యలపై విస్తృతంగా చర్చించారు.