MNCL: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు త్వరగా ఇంటి నిర్మాణం పూర్తి చేసి ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని పొందాలని సబ్ కలెక్టర్ మనోజ్ అన్నారు. బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామపంచాయతీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నూతన గృహప్రవేశ కార్యక్రమానికి గురువారం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.