PPM: కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని TUCI సంయుక్త కన్వీనర్ తోట జీవన్న అన్నారు. ఆదివారం పార్వతీపురంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బ్రిటిష్ వారితో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు రద్దు చేయడం దారుణమన్నారు. 44 కార్మిక చట్టాలను కేవలం నాలుగు కోడ్లగా మార్చడం అన్యాయమని తెలిపారు.